TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఉచిత ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలొచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
వార్తలు
యాదగిరిగుట్టలో పెరిగిన భక్తుల రద్దీ


