హైదరాబాద్: 28°C
వార్తలు

వ్యాపారి ఇంట్లో దొంగల బీభత్సం

TG: హైదరాబాద్ అత్తాపూర్ హసన్‌నగర్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంటి తాళం పగులగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించారు. రూ.23 లక్షల నగదు, 5 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు వ్యాపారి ఫిర్యాదు చేశారు. నగదు, బంగారం చోరీపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.