TG: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి వాతావరణంలో మార్పులు వచ్చే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ పేర్కొంది. మరింత వేడి పెరిగి చాలా చోట్ల 34 డిగ్రీల నుంచి 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఉదయం వాతావరణం చల్లగా ఉంటుందని స్పష్టం చేసింది. ఎల్లుండి కర్ణాటక సరిహద్దులో ఉన్న దక్షిణ తెలంగాణ ప్రాంతంలో చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
వార్తలు
మళ్లీ ఎండలు.. పెరగనున్న టెంపరేచర్!


