AP: శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదిలో వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. మరోవైపు నాగావళి నది నీటిమట్టం నిలకడగా ప్రవహిస్తుండగా, మహేంద్రతనయ, బహుదా నదులు శాంతించాయి. అయితే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాన్ని బట్టి నదీపరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
వార్తలు
వంశధారలో కొనసాగుతున్న వరద ఉధృతి


