హైదరాబాద్: 28°C
వార్తలు

భారీవర్షాలు.. 17 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. మూడు రోజుల్లోనే 17 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ముఖ్యంగా 8 జిల్లాల్లో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. నేషనల్ హైవేలపైకి వరద నీరు చేరడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, బాధితులకు తక్షణ సాయం అందించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.