హైదరాబాద్: 28°C
వార్తలు

భద్రాచలం దగ్గర గోదావరికి వరద ఉదృతి

TG: భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద పోటెత్తింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే నీటిమట్టం ఏకంగా 20 అడుగుల మేర పెరగడం గమనార్హం. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 40.5 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు 8,19,246 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి ఉగ్రరూపం దాల్చుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.