ఉత్తరాదిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో ఛార్‌ధామ్ యాత్రను ఇవాళ అధికారులు నిలిపివేశారు. IMD పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో భద్రతా దృష్ట్యా 5 జిల్లాల్లో స్కూళ్లను మూసివేశారు. యాత్రికులను హరిద్వార్, రిషికేశ్, సోన్‌ప్రయాగ్ వద్దనే నిలిపివేశారు. వాతావరణం చక్కబడిన తర్వాత పరిస్థితులను సమీక్షించి యాత్రను తిరిగి అనుమతించనున్నారు.
వార్తలు
ఛార్‌ధామ్ యాత్ర నిలిపివేత.. ఎందుకంటే?


