పులికాట్ సరస్సులో చేపల వేటపై AP, తమిళనాడు జాలర్ల మధ్య తరచూ తలెత్తుతున్న వివాదాలకు పరిష్కారం దొరికింది. ఇరు రాష్ట్రాల జాలర్లతో జరిగిన సమావేశంలో సరస్సు సరిహద్దులను GPS ద్వారా ఖచ్చితంగా గుర్తించి, ఆ హద్దుల మేరకే చేపల వేట కొనసాగించాలని నిర్ణయించారు. తిరువళ్లూర్ కలెక్టర్ అధ్యక్షత జరిగిన సమావేశంలో 2 రాష్ట్రాల మత్స్యకారులు, అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
వార్తలు
పులికాట్‌లో జాలర్ల గొడవలకు చెక్!


