హైదరాబాద్: 28°C
వార్తలు

వరద నీటితో రిజర్వాయర్లను నింపండి: చంద్రబాబు

AP: వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. భారీ వర్షాలతో రాష్ట్రంలోని 29 రిజర్వాయర్లలో నీటి మట్టాలు పెరిగాయని సంతోషం వ్యక్తం చేశారు. పెరిగిన నీటి నిల్వలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని రిజర్వాయర్లను నింపాలని సూచించారు. కృష్ణా, గోదావరి, నాగావళి, వంశధార బేసిన్లలో నీటి ప్రవాహాలు పెరిగాయని చంద్రబాబు పేర్కొన్నారు.