హైదరాబాద్: 28°C
వార్తలు

ధవళేశ్వరానికి భారీ వరద సూచన

AP: ఇవాళ ధవళేశ్వరం బ్యారేజీకి 8-9 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. తర్వాత ఇది క్రమంగా తగ్గుతుందని తెలిపింది. నిన్న సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.19 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రభావిత ప్రాంతాలైన తూ. గోదావరి, కోనసీమ, కాకినాడ, ప. గోదావరి, ఏలూరు, పోలవరం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.