AP: కలియుగ వైకుంఠం తిరుమలలో పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ మలయప్ప స్వామివారు సర్వాలంకార భూషితుడై.. గరుడునిపై తిరుమల మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. గరుడసేవను దర్శించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. సేవ జరుగుతున్నంతసేపు గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి.
వార్తలు
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ


