హైదరాబాద్: 28°C
వార్తలు

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: బొత్స

AP: భారీ వర్షాలతో నష్టపోయిన విజయనగరం రైతులకు తగిన పరిహారం అందించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. బొప్పాయి, అరటి వంటి పంటలకు ఎకరాకు రూ.లక్ష వరకు, ఇతర పంటలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెప్పినట్లు హెక్టారుకు రూ.25 వేల పరిహారం ఏ మాత్రం సరిపోదని అన్నారు. జిల్లాలో సుమారు రూ.10 కోట్ల నష్టం జరిగిందని చెప్పారు.