AP: తెనాలిని మరింత అభివృద్ధి చేస్తానని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలిలో 2.8 కి.మీ సెంట్రల్ లైటింగ్ పనులను మంత్రి ప్రారంభించారు. రాత్రివేళ ప్రజల భద్రత కోసం ఈ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రూ.50 లక్షలతో డివైడర్ల సుందరీకరణ చేపట్టి.. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కంఠెవరం వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు.
వార్తలు
తెనాలిని మరింత అభివృద్ధి చేస్తా: నాదెండ్ల


