భారీ వర్షాలు ఉత్తరప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. 63 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 15 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. 100కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. రెడ్ అలర్ట్, ఆకస్మిక వరదల ముప్పు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లను మూసివేయాలని అధికారులను సీఎం ఆదిత్యనాథ్ ఆదేశించారు.
వార్తలు
యూపీలో భారీ వర్షాలు.. 15 మంది మృతి


