హైదరాబాద్: 28°C
వార్తలు

వ్యాక్సినేషన్ తనిఖీ చేసిన ఇమ్యునైజేషన్ అధికారి

MDK: తూప్రాన్‌లో వ్యాక్సినేషన్‌ను జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి జయ శ్రీ పరిశీలించారు. తూప్రాన్ పట్టణంలోని సబ్ సెంటర్- ఏ, సబ్ సెంటర్- బీ కేంద్రాలలో శనివారం జరుగుతున్న వ్యాక్సినేషన్ తీరును పరిశీలన చేశారు. వ్యాక్సినేషన్ చేసే తీరును పరిశీలించడంతో పాటు, వ్యాక్సినేషన్ అందుబాటు తీరు తనిఖీ చేశారు. చిన్నారులకు సక్రమంగా వ్యాక్సినేషన్ చేయాలని సూచించారు.