హైదరాబాద్: 28°C
వార్తలు

ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు: బీజేపీ ఎంపీ

ఓటర్లకు నాయకుల వయసుతో సంబంధం లేదని కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చెప్పారు. నిజాయితీ, సామర్థ్యం, సమస్యలను పరిష్కరించే, సంస్కరణలు తీసుకొచ్చే సామర్థ్యం ఉన్న నేతలనే ప్రజలు కోరుకుంటారని తెలిపారు. గతంలో వయసు, సీనియారిటీకి భారత్‌లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారని.. ఇప్పుడు యువత మెరిట్, ప్రతిభ, తాము అందిస్తున్న విలువకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటం మార్పుకు సంకేతమన్నారు.