హైదరాబాద్: 28°C
వార్తలు

ఉత్తర హైదరాబాద్‌కు మెట్రో ఎప్పుడొస్తుంది?

MDCL: నగర ఉత్తర ప్రాంతాలకు మెట్రో సేవల విస్తరణపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. మేడ్చల్, శామీర్‌పేట్ వైపు మెట్రో పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయంటూ SMలో పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉత్తర ప్రాంతాల నుంచి గచ్చిబౌలి, హైటెక్ సిటీకి నిత్యం రాకపోకలు సాగించే ఉద్యోగులకు ప్రయాణ సమయం, ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు. మెట్రో పనులను త్వరగా చేపట్టాలని కోరుతున్నారు.