SKLM: పాతపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం స్థానిక సీఐ వెంకటరమణ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు రవాణా భద్రతపై అవగాహన కల్పిస్తూ.. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో మెలగాలని కోరారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
వార్తలు
హెల్మెట్‌పై అవగాహన కల్పించిన సీఐ


