హైదరాబాద్: 28°C
వార్తలు

మొజాంజాహి మార్కెట్లో ఆగిన గడియారం

HYD: చారిత్రక మొజాంజాహి మార్కెట్‌లోని దక్షిణ వైపు గడియారం మరోసారి నిలిచిపోయింది. వారసత్వ కట్టడంలో భాగమైన ఈ గడియారం గతంలోనూ పనిచేయకపోవడంతో మరమ్మతులు చేపట్టారు. మార్కెట్ పునరుద్ధరణ సమయంలో గడియారాలను మార్చినప్పటికీ, ప్రస్తుతం మళ్లీ ఆగిపోవడంతో నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గడియారాన్ని వెంటనే పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.