మహారాష్ట్రలో నాగ్‌పూర్-ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్‌పై దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. బోర్ఖేడి స్టేషన్ దాటిన తర్వాత జరిగిన ఈ దాడిలో ఏ-1, బీ-2, బీ-5 కోచ్‌ల కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. కిటికీలను బద్దలుకొట్టుకొని లోపలికి రాళ్లు రావడంతో ప్రయాణికులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన RPF, GRP బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి.
వార్తలు
VIDEO: ట్రైన్‌పై రాళ్ల దాడి.. తప్పిన ప్రమాదం


