హైదరాబాద్: 28°C
వార్తలు

పార్టీ నేతలకు అఖిలేశ్ వార్నింగ్

యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ పార్టీ నేతలకు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ హెచ్చరికలు జారీ చేశారు. ముందస్తు సన్నాహాలు లేకుండా ఎలాంటి చర్చల్లోకి వెళ్లొద్దని సూచించారు. అవగాహన లేకుండా మాట్లాడటం మంచిది కాదని.. దాని కన్నా మౌనంగా ఉండటమే ముఖ్యమని తెలిపారు. మీరు చెప్పే ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతుందని, 10 సెకన్ల రీల్ పార్టీ ప్రతిష్టను నిలబెట్టగలదు, దెబ్బతీయగలదన్నారు.