మధ్యప్రదేశ్ మండ్లా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గణేశ్ నిమజ్జనం అనంతరం మండపం వేదికపై విశ్రాంతి తీసుకుంటున్న పలువురికి విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ తీగ తెగిపడటంతో కరెంట్ షాక్ తగిలి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
వార్తలు
గణేష్ మండపంలో కరెంట్ షాక్.. నలుగురు మృతి


