రాజస్థాన్ జాలోర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులతో షాపునకు వెళ్లిన చిన్నారి ఆడుకుంటూ రోడ్డుపైకి రావడంతో వేగంగా వచ్చిన స్కార్పియో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం తర్వాత స్కార్పియో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.
వార్తలు
స్పీడ్‌గా దూసుకొచ్చిన స్కార్పియో.. చిన్నారి మృతి


