హైదరాబాద్: 28°C
వార్తలు

265 తాలూకాలను కరవు ప్రాంతాలుగా ప్రకటన

ఎల్‌నిన్ ప్రభావం నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 74 శాతం తాలుకాల్లో తీవ్ర వర్షాభావం ఉన్నట్లు గుర్తించింది. ఈ మేరకు 265 తాలుకాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరవు ప్రభావిత ప్రాంతాల్లో వర్షపాతం, భూగర్భ పరిస్థితులు, పంటల పరిస్థితి, నీటి లభ్యత అంశాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.