హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వర్షాలు.. చార్‌ధామ్ యాత్ర నిలిపివేత

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడతాయంటూ రెడ్ అలర్ట్, మరి కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో శని, ఆదివారాల్లో చార్‌ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు భక్తులు సహకరించాలని కోరారు.