హైదరాబాద్: 28°C
వార్తలు

30న ఇండియా కూటమి నేతల భేటీ

CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు ఒత్తిడి పెంచే దిశగా విపక్షాలు కార్యచరణకు సిద్ధమయ్యాయి. ఈ అంశంలో ఆందోళనలపై చర్చించేందుకు ఇండియా కూటమి నేతలు ఈ నెల 30న ఢిల్లీలో భేటీ కానున్నాయి.  జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తప్పించాలనే డిమాండ్‌పై పరస్పరం సంప్రదింపులు జరిపి.. ఉమ్మడి నిర్ణయం తీసుకోనున్నాయి. అలాగే ఆయన అభిశంసనకు మరోసారి పార్లమెంటులో నోటీసులు ఇవ్వనున్నాయి.