హైదరాబాద్: 28°C
వార్తలు

యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం: సర్వే

UP అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి BJP అధికారంలోకి వస్తుందని తాజా సర్వేలో వెల్లడైంది. న్యూస్ లీడర్ లైవ్- మాట్రిజ్ న్యూస్ కమ్యూనికేషన్ నిర్వహించిన సర్వే ప్రకారం మొత్తం 403 స్థానాలకుగానూ NDA కూటమి 267 స్థానాల్లో గెలుస్తుందని చెప్పింది. అలాగే కాంగ్రెస్+ఎస్పీ కూటమి 132 స్థానాలకు పరిమితం అవుతుందని పేర్కొంది. BSPకి రెండు, ఇతరులు రెండు స్థానాలను కైవసం చేసుకుంటారని తెలిపింది.