హైదరాబాద్: 28°C
వార్తలు

లోక్‌సభ స్పీకర్‌కు కేంద్రమంత్రి లేఖ

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ లేఖ రాశారు. పార్లమెంటులో కీలక బిల్లులపై చర్చ జరుగుతున్న సమయంలో షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన ఎంపీలు మాట్లాడేందుకు మరింత ఎక్కువ సమయం ఇవ్వాలని కోరారు. మధ్యప్రదేశ్‌కు చెందిన జేపీపీ ఎంపీ గజేంద్ర సింగ్ ఈ అంశాన్ని తన వద్ద లేవనెత్తినట్లు చెప్పారు. ఈ మేరకు అధికారులు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.