హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రగ్స్ దుర్వినియోగంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు

పిల్లలు మాదకద్రవ్యాల బారిన పడటంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరు డ్రగ్స్ బారిన పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ దుర్వినియోగాన్ని కేవలం ఒక ఆరోగ్య సమస్యగా మాత్రమే కాకుండా, బాలల సంరక్షణ సమస్యగా చూడాలని ఆయన సూచించారు. పిల్లల భవిష్యత్తును కాపాడేందుకు సమాజమంతా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.