హైదరాబాద్: 28°C
వార్తలు

కల్తీ మద్యం తాగి 19 మంది మృతి

నాగాలాండ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి రెండు రోజుల వ్యవధిలోనే ఏకంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అప్రమత్తమైన అధికారులు బాధిత ప్రాంతాల్లో వైద్య సహాయం అందిస్తున్నారు. ఈ మరణాలపై సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు సిట్ ఏర్పాటు చేసింది. పోలీసులు ముమ్మరంగా విచారణ చేపట్టారు.