AP: రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. టూరిజం పెట్టుబడులకు ప్రోత్సాహకాలు, ఇన్సెంటివ్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. పర్యాటకానికి అనుకూలమైన భూములు గుర్తించి టూరిజం అభివృద్ధికి వినియోగిస్తామని చెప్పారు. టూరిజం ప్రచారానికి దేశవ్యాప్తంగా రోడ్ షోలు నిర్వహిస్తామని, ప్రమోషన్‌కు ఏఐ, టెక్నాలజీ వినియోగిస్తామని మంత్రి అన్నారు.
వార్తలు
టూరిజం అభివృద్ధికి చర్యలు: మంత్రి దుర్గేష్


