హైదరాబాద్: 28°C
వార్తలు

గోల్డ్ మెడల్.. అంతలోనే ఊహించని విషాదం

గాజియాబాద్‌లో(UP) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ప్రాచి అనే విద్యార్థిని ఓ భవనం 12వ అంతస్తు పైనుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయింది. రెండు రోజుల క్రితమే ఆమె జాతీయ రోప్‌ స్కిప్పింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించింది. గోల్డ్ మెడల్ గెలిచిందన్న ఆనందం 2 రోజులు కూడా నిలవకుండానే ఇలా జరగడంతో ఆ చిన్నారి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.