హైదరాబాద్: 28°C
వార్తలు

ఇడ్లీ రవ్వ, రాగి పిండిలో రూ.15 కోట్ల గోల్డ్ స్మగ్లింగ్

ముంబై విమానాశ్రయంలో రూ.15 కోట్ల విలువైన 9.40 కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. స్మగ్లర్లు అత్యంత తెలివిగా బంగారం పొడిని ఇడ్లీ రవ్వ, రాగి పిండి, ఓట్స్‌లో కలిపి తరలిస్తుండగా పట్టుబడ్డారు. ప్రయాణికులపై అనుమానంతో అధికారులు ఆయా ఆహార పదార్థాలను వేరు చేసి పరీక్షించగా బంగారం గుట్టురట్టైంది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అధికారులు అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.