హైదరాబాద్: 28°C
వార్తలు

174 హోటళ్లకు అధికారుల నోటీసులు

ఉత్తరప్రదేశ్‌లో అధికారులు 'శుద్ధ్ హీ శుభ్ హై' పేరిట 6 నగరాల్లోని హోటళ్లపై మెరుపుదాడులు చేశారు. ఈగలు, బొద్దింకలు, ఎలుకల మధ్య కుళ్లిన ఆహారం వండుతున్నట్లు గుర్తించి 174 హోటళ్లకు నోటీసులు జారీచేశారు. 24 హోటళ్లపై కఠిన చర్యలు తీసుకున్నారు. పలు సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేసి, 5 హోటళ్లను మూసివేయించారు. ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకుంటే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.