హైదరాబాద్: 28°C
వార్తలు

కోర్టులో బ్రిజ్ భూషణ్ కేసు విచారణ వాయిదా

మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో WFI మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ నిర్దోషిగా విడుదలవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్‌పై విచారణను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈనెల 28కి వాయిదా వేసింది. సంబంధిత న్యాయమూర్తి ఇవాళ జ్యుడీషియల్ శిక్షణలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. బ్రిజ్ భూషణ్ నిర్దోషిగా తేలడాన్ని సవాల్ చేస్తూ మహిళా రెజ్లర్లు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.