హైదరాబాద్: 28°C
వార్తలు

జూరాలకు పెరుగుతున్న వరద

TG: జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 6 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 4,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రస్తుత నీటిమట్టం 318.45 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కావడంతో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.