హైదరాబాద్: 28°C
వార్తలు

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్

TG: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరింది. ఈనెల 9న 19,543 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. గతంతో పోలిస్తే 17 శాతం పెరిగింది. బోరుబావుల కింద సాగు పెరగడంతో ఖరీఫ్‌లో వినియోగం అధికమైంది. సోలార్ ఉత్పత్తి తగ్గడంతో 1,400 మెగావాట్ల లోటు ఏర్పడింది. దీంతో 5,193 మెగావాట్ల విద్యుత్‌ను బయటనుంచి కొనుగోలు చేశారు. సెప్టెంబర్‌లో 324.8 మిలియన్ యూనిట్ల లోటు నమోదైంది.