హైదరాబాద్: 28°C
వార్తలు

కొంప ముంచిన రీల్స్ పిచ్చి!

కన్యాకుమారిలోని(D) తమ్మట్టుకోణంలో ప్రముఖ యూట్యూబర్ వినోద్ కుమార్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆయన భార్య మధుమిత మంచంపై కట్టల కొద్దీ ఉన్న నగదు వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అది చూసిన దొంగలు, వారు షాపింగ్‌కి వెళ్లిన సమయంలో వెనుక డోర్ నుంచి ఇంట్లోకి చొరబడి కిలో బంగారం, రూ.1 కోటి నగదు ఎత్తుకెళ్లారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.