హైదరాబాద్: 28°C
వార్తలు

కర్నూలు, కడపలో రామ్మోహన్ నాయుడు పర్యటన

AP: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఇవాళ కర్నూలు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి మంత్రి చేరుకుంటారు. అక్కడ ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని మంత్రి ప్రారంభిస్తారు. అనంతరం కడప విమానాశ్రయానికి చేరుకొని అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇవాళ రాత్రికి మంత్రి తిరువనంతపురం వెళ్లనున్నారు.