హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రంలో వరి సాగుపై ఎల్‌నినో ఎఫెక్ట్

AP: ఎల్‌నినో కారణంగా వరిసాగు విస్తీర్ణం తగ్గింది. 2025 రబీలో 17.35 లక్షల హెక్టార్లలో వరి సాగైతే.. ఈ ఏడాది ఇంకా 13.28 లక్షల హెక్టార్లలోనే పంట వేశారు. కృష్ణా, గోదావరి డెల్టాల పరిధిలో సాగు ఆశాజనకంగా ఉన్నా.. సాగర్‌ ఆయకట్టు, రాయలసీమలో వరి నాట్లు పడలేదు. గత ఖరీఫ్‌లో 94.91 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, ఈ ఏడాది 66.76 లక్షల టన్నులు రావొచ్చని అధికారుల అంచనా.