హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రంలో 200 కొత్త కోర్టుల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్

TG: రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 200 అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు న్యాయ శాఖ కార్యదర్శి G.O.Ms.No.59ను జారీ చేశారు. కేసుల భారాన్ని తగ్గించేందుకు మొత్తం 594 కొత్త కోర్టులను ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ కోరారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం తొలిదశ కింద 200 కోర్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.