AP: అమరావతి ప్రాజెక్టుల వారీ భూసమీకరణ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎకరం కంటే తక్కువ భూమి ఇచ్చిన LPS రైతులకు యాన్యుటీ చెల్లింపులకు ఆమోదం తెలిపింది. 1,304 మంది రైతులకు రూ.5.04 కోట్లను ప్రభుత్వం చెల్లించనుంది. డ్రైల్యాండుకు ఏడాదికి రూ.40వేలు, జరీబు భూమికి ఏడాదికి రూ.60 వేల యాన్యుటీని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎకరంలోపు భూమి ఇచ్చిన రైతులకు పదేళ్ల పాటు యాన్యుటీ చెల్లిస్తారు.
వార్తలు
అమరావతి భూసమీకరణ రైతులకు శుభవార్త


