TG: హైదరాబాద్ గచ్చిబౌలి విప్రో సర్కిల్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహం కొలువుదీరనుంది. ఆయన జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దేశ నిర్మాణంలో మన్మోహన్ సింగ్ పాత్ర, ఆర్థిక దూరదృష్టి, నిరాడంబర నాయకత్వానికి ఈ విగ్రహం చిరస్థాయి గుర్తుగా నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
వార్తలు
మన్మోహన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న రేవంత్


