హైదరాబాద్: 28°C
వార్తలు

పంట నష్టం నమోదు వేగవంతం చేయండి: అచ్చెన్న

AP: భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న పంట నష్టాల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. పంటల రక్షణ, నష్టాల అంచనా, నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని.. నీట మునిగిన పంటల రక్షణకు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.