హైదరాబాద్: 28°C
వార్తలు

ఇవాళ ఉదయానికి నిమజ్జన ప్రక్రియ పూర్తి: DGP

TG: హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని DGP C.V. ఆనంద్ తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది విగ్రహాల సంఖ్య ఎక్కువగా ఉందని.. అయినప్పటికీ నిమజ్జన ప్రక్రియ వేగంగా సాగుతోందని చెప్పారు. ఇవాళ ఉదయం 10.30 గంటలలోపు హైదరాబాద్‌లో నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరేలా పోలీసులకు సహకరించాలని కోరారు.