హైదరాబాద్: 28°C
వార్తలు

రాచర్ల గొల్లపల్లిలో ఘనంగా గణేష్ నిమజ్జనం

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం వినాయక నిమజ్జనం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వీర శివాజీ యూత్ ఆధ్వర్యంలో శోభాయాత్ర చేపట్టారు. సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా సూచించారు. సీఐ వెంకటేష్, ఎస్సై రమేష్ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.