హైదరాబాద్: 28°C
వార్తలు

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

NGKL: సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ సూచించారు. ఆన్‌లైన్ యాప్స్, లింక్స్, ఫోన్ కాల్స్ మరియు ఆన్‌లైన్ సెర్చింగ్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొన్నారు. అపరిచితులతో బ్యాంక్ వివరాలు, OTP ఎట్టిపరిస్థితుల్లోనూ పంచుకోవద్దని.. ఒకవేళ సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్పీ స్పష్టం చేశారు.