MDK: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయినట్లు ఆర్డీవో, ఎన్నికల అధికారి డా. కె. రమాదేవి తెలిపారు. వచ్చిన 23 నామినేషన్లలో 22 ఆమోదించి, ఒకటి తిరస్కరించామన్నారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణతో పాటు తుది జాబితా విడుదల చేయనున్నట్లు చెప్పారు. అక్టోబర్ 4న పోలింగ్ పారదర్శకంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
వార్తలు
రెడ్ క్రాస్ సొసైటీ నామినేషన్ల పరిశీలన పూర్తి


