హైదరాబాద్: 28°C
వార్తలు

బ్యాంక్‌లో భారీ దోపిడీ.. 23 కేజీల బంగారం చోరీ

జార్ఖండ్ జంషెడ్‌పూర్‌లో గోల్మురి ప్రాంతంలో ఉన్న కెనరా బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. బ్యాంకులోకి తుపాకులతో వచ్చిన ఐదుగురు దుండగులు సిబ్బందిని బంధించి 23 కేజీల బంగారం, రూ.43 లక్షల నగదును తీసుకుని పరారయ్యారు. బంగారం విలువ దాదాపు రూ.33-36 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.