సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. వెంటనే జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నేతలు నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బారికేడ్లను తొలగించుకుని ఢిల్లీలోని ఈసీ కార్యాలయం వైపు దూసుకెళ్లారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని నిర్బంధించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది.
వార్తలు
కాంగ్రెస్ ఆందోళనల్లో ఉద్రిక్తత


